: అసెంబ్లీ ఉందిగా... నేటి విచారణకు రాలేనన్న జగన్... అనుమతించిన కోర్టు!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నేడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కేసు విచారణలో వేగం పెంచిన కోర్టు, ఇకపై వారంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని జగన్ సహా నిందితులందరికీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం జగన్ సహా కేసులోని నిందితులంతా ఒకేసారి కోర్టుకు రావడంతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. నేడు కూడా నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్ష నేత హోదాలో తాను సమావేశాల చివరి రోజున అసెంబ్లీకి హాజరుకావాల్సి ఉందని చెప్పిన జగన్, తన అభ్యర్థనను మన్నించాలని కోర్టును కోరారు. దీనిపై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జగన్ అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది.

  • Loading...

More Telugu News