: పట్టాలు తప్పిన చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్... 40 మందికి గాయాలు
మరో రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నేటి తెల్లవారుజామున తమిళనాడులోని కడలూరు వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చెన్నై-మంగళూరు ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో దాదాపు 40 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు మృత్యువాత పడలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానికులతో పాటు రైల్వే సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దక్షిణ రైల్వే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.