: సినీ ఫక్కీలో తప్పించుకున్న ఖైదీలు


పాత సినిమాల్లో ఖైదీలను జైలు నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్తుండగా మధ్యలో కొందరు దుండగులు వచ్చి అడ్డగించి, పోలీసులపై కాల్పులు జరుపుతుండగా ఖైదీలు తప్పించుకుని పారిపోతారు. ఇంచుమించు ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని అజ్మీర్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని నాగౌర్ కు చెందిన ఆనంద్ సింగ్ పై పలు కేసులున్నాయి. అజ్మీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ సింగ్ సహా నలుగురు ఖైదీలను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్తుండగా ముసుగులు ధరించిన కొందరు ఆగంతుకులు పోలీస్ వ్యాన్ ను అటకాయించి, పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని ఎదుర్కొనే పనిలో ఉండగా, వ్యాన్ లో ఉన్న నలుగురు ఖైదీలు పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు, గాలింపు చేపట్టారు. ఖైదీలు పక్కా ప్లాన్ ప్రకారమే తప్పించుకుపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News