: జపాన్ లో వింత జబ్బు!


జపాన్ దేశంలో స్టెరిప్టోకోకోల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (ఫ్లెష్ ఈటింగ్) అనే జబ్బు రోజురోజుకీ వ్యాపిస్తోంది. కణజాలంపై ప్రభావం చూపే ఈ జబ్బు బారిన ఇప్పటికే 291 మంది పడ్డారు. ఈ విషయాన్ని జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపింది. చర్మం, రక్తం, కండరాలు లక్ష్యంగా ఇన్ ఫెక్షన్ సోకుతుంది. ఇది కణజాలాన్ని తినివేస్తుంది. వ్యాధి ముదిరితే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా గత మూడు రోజుల్లోనే 76 మంది మరణించారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం వయసు మళ్లిన వారు ఉన్నారు. గొంతు, చర్మానికి ఇన్ ఫెక్షన్ రావడం ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలుగా సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News