: ఏడు ప్రశ్నలతో ఏపీ సీఎంను, మంత్రి గంటాను నిలదీసిన రిషితేశ్వరి తండ్రి


నాగార్జునా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ భూతానికి బలైన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఆమె తండ్రి మురళీ కృష్ణ నిలదీశారు. ఏడు ప్రశ్నలతో కూడిన లేఖను ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంధించారు. ఆ లేఖలో... కేసులో ప్రిన్సిపల్ బాబూరావు పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యానికి కారణం ఏంటని ఆయన అడిగారు. ఫ్రెషర్స్ డే రోజు ప్రిన్సిపల్ బాబూరావు రిషితేశ్వరికి ఉద్దేశపూర్వకంగానే శ్రీనివాస్ తో అవార్డు ఇప్పించారు. ఆ తరువాత ఆమెను వేధించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అడిగారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలిసిన తరువాత ఆమె గది వద్దకు ప్రిన్సిపల్ బాబూరావు ముందుగా వెళ్లారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి బాబూరావు ఆమెను ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. బాలసుబ్రమణ్యం కమిటీ నాగార్జునా వర్సిటీలో ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించినప్పటికీ ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అడిగారు. పోలీసులు ఛార్జిషీట్ వేయకముందే బాబూరావుపై కేసు నమోదు చేసి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము పిర్యాదు చేసేంతవరకు యూనివర్సిటీ అధికారులు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News