: మా అమ్మ కూడా ఇంద్రాణి ముఖర్జియా లాంటిదే...విద్యార్థి ఆవేదన


ఢిల్లీలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని పాఠశాలల్లో హోం వర్కు చేయని విద్యార్థులు ఎందుకు చేయలేకపోయారో కారణాలు వివరిస్తూ టీచర్లకు లేఖలు రాస్తుంటారు. ఇది సాధారణం... కానీ ఓ పాఠశాల విద్యార్థి రాసిన లేఖ టీచర్లను నిర్ఘాంతపోయేలా చేసింది. తన తల్లి కూడా ఇంద్రాణి ముఖర్జియా లాంటిదేనని, తన తల్లికి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తాను కూడా అక్రమ సంతానాన్నని ఆ బాలుడు లేఖలో పేర్కొన్నాడు. దీంతో ప్రిన్సిపల్ దృష్టికి బాలుడి లేఖ విషయాన్ని టీచర్లు తీసుకెళ్లారు. అంతా విన్న ప్రిన్సిపల్ బాలుడి తల్లిదండ్రులను స్కూల్ కి పిలిపించి మాట్లాడారు. అనంతరం బాలుడికి పాఠశాల యాజమాన్యం కౌన్సిలింగ్ ఇస్తోంది. పసి హృదయాలపై ఇంద్రాణి ముఖర్జియా వంటి వార్తలు నాటుకుంటే ప్రమాదమని వారు సూచిస్తున్నారు. వారిలోని ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News