: భారత బాక్సర్ కంటే... పాకిస్థాన్ అర్షద్ ఖాన్ గొప్పగా జీవిస్తున్నాడు


పాకిస్థాన్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగి ఆస్ట్రేలియాలో టాక్సీ నడుపుకుంటున్న అర్షద్ ఖాన్ గురించిన వార్తలు చదివి అయ్యో అనుకోని పాఠకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆస్ట్రేలియాలో టాక్సీ నడుపుతున్నాడంటే ఓ మోస్తరు ఆదాయం లభించడం సాధారణం, కానీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన బాక్సర్ కమల్ కుమార్ అతనికంటే దుర్భర జీవితం అనుభవిస్తున్నాడు. కమల్ కుమార్ 1991లో జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 1993, 2004, 2006ల్లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించాడు. తరువాత ప్రోత్సహించే వారు కరుయ్యారు. ఇప్పుడు బాక్సింగ్ ఆడే శక్తి లేదు. దీంతో ప్రభుత్వోద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లభించలేదు. దీంతో కమల్ కుమార్ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినప్పటికీ బాక్సింగ్ పై మక్కువ చావలేదని, తన ఇద్దరు పిల్లలను బాక్సర్లను చేస్తానని చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News