: అడ్డుకుంటున్నారని విలపించిన విద్యార్థి...స్పందించిన హరీష్ రావు


వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలానికి మంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు స్థానికులు ఉత్సాహం చూపారు. వారిలో ఓ బాలుడు కూడా ఉన్నాడు. మంత్రి హరీష్ రావును కలిసేందుకు ప్రయత్నించిన బాలుడ్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో బాలుడు బిగ్గరగా ఏడ్చాడు. బాలుడ్ని గమనించిన హరీష్ రావు సిబ్బందిని వారించి బాలుడ్ని కలిశారు. సమస్య చెప్పమని అడిగారు. దీంతో తన తల్లి మరణించిందని, తండ్రి పట్టించుకోవడం లేదని, దాని వల్ల ప్రైవేటు పాఠశాలలో చదువుకునే స్తోమత లేక ఐదవ తరగతి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చిందని వాపోయాడు. దీంతో స్పందించిన మంత్రి బాలుడి చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. అక్కడే ఉన్న పారిశ్రామిక వేత్త రామడుగు రాందేవ్ స్పందించి, బాలుడి విద్యకు అవసరమైన ఖర్చు భరిస్తానని ప్రకటించారు. అలాగే మిషన్ కాకతీయకు 12 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

  • Loading...

More Telugu News