: విజయవాడకు మారుతున్న చంద్రబాబు మకాం... ఈ నెల 9 నుంచి గెస్ట్ హౌస్ లోనే నివాసం


వారానికి నాలుగు రోజుల పాటు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచే పరిపాలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన నివాసాన్ని పూర్తిగా విజయవాడకు మార్చబోతున్నారు. ఈ నెల 9 నుంచి కుటుంబం సహా ఆయన విజయవాడ కృష్ణానదీ తీరంలోని లింగమనేని గెస్ట్ హౌస్ ను తన నివాసంగా ఉపయోగించబోతున్నారు. ఇటీవలే గెస్ట్ హౌస్ లో సీఎం సతీమణి భువనేశ్వరి గృహ ప్రవేశం చేసి పూజలు చేశారు. ఆ తరువాత ఇంటికి కావల్సిన సామాన్లను తరలించారు. మరోవైపు పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా విజయవాడకు తరలిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనా విభాగంలోని రెండు సెక్షన్లు, సీఎం సహాయ నిధి సిబ్బందిని, ప్రొటోకాల్ సెక్షన్ లో సగం మందిని బదిలీ చేశారు. త్వరలో మరికొంతమంది ఉద్యోగులను కూడా విజయవాడకు తరలించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News