: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలతో పెను ప్రమాదమన్న 'ది న్యూస్ ఇంటర్నేషనల్'
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని పాక్ దినపత్రిక 'ది న్యూస్ ఇంటర్నేషనల్' హెచ్చరించింది. ఈ మేరకు గురువారం నాడు ఎడిటోరియల్ ప్రచురించింది. ఎల్ఓసీ వెంబడి ఇరుదేశాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలో 70 సార్లు ఉల్లంఘించిందని తెలిపింది. గత కొన్ని రోజుల పరిస్థితులను గమనిస్తే ఈ కాల్పులు ఎప్పుడు ఆగిపోతాయనేది ప్రశ్నార్థకంగానే ఉందని ఆ ఎడిటోరియల్ లో రాసింది. మొట్టమొదట కాల్పులకు పాల్పడింది మీరంటే మీరని పాకిస్థాన్ రేంజర్లు, భారత భద్రతా దళాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయని ది న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది.