: రైల్వేలు, రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ పెట్టుబడులు
దేశంలో రైల్వేలు, రహదారులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రైల్వేలపై రూ.8.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ పెట్టుబడులతో రైల్వేల ముఖచిత్రం మారిపోతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, రైల్వేలతో పాటు ఈ ఏడాది రహదారులపై కూడా పెట్టుబడులు ఎక్కువగానే పెడుతున్నామని వివరించారు. రహదారులు, జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి భూ సంస్కరణలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.