: వెంటనే చర్చంటే ఎలా? మేం రెడీ కావద్దా?: రోజా సూటి ప్రశ్న


అసెంబ్లీలో ఏవైనా బిల్లులు పెట్టేముందు, ఆ వివరాలపై వారం రోజుల ముందుగానే సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ, దాన్ని తుంగలో తొక్కి, అప్పటికప్పుడు బిల్లులు పెడుతూ, చర్చకు రావాలంటే ఎలా సాధ్యమవుతుందని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. బిల్లులపై తగిన సమాచారం సేకరించి, చర్చకు తాము సిద్ధం కావద్దా? అని అధికార పక్షాన్ని అడిగారు. ఒకేసారి 9 బిల్లులను ప్రవేశపెట్టి, వాటిపై చర్చించమనడం తగదని విమర్శించారు. వాకౌట్ విపక్షం హక్కని గుర్తు చేసిన ఆమె, వాకౌట్ కారణాన్ని చెప్పేందుకు సైతం మైక్ ఇవ్వకపోవడం దారుణమని దుయ్యబట్టారు. ఆనాడు విపక్షంలో ఉన్న చంద్రబాబు, యనమల ఇలాగే వ్యవహరించారా? అని నిలదీశారు. ఏ అంశంపైనా సమగ్ర చర్చ జరగకుండా, సభను తెలుగుదేశం పార్టీ పక్కదారి పట్టిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News