: నెలలోగా సీమకు నీళ్లు రాకపోతే టీడీపీ నేతలు తల ఎక్కడ పెట్టుకుంటారు?: రఘువీరా


పట్టిసీమ నుంచి నీటి సరఫరా మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. నెల రోజుల్లోపల రాయలసీమకు నీళ్లు రాకపోతే... టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీలు వ్యతిరేకమని ఆయన అన్నారు. ఒకవేళ, పోలవరంకు పట్టిసీమ ప్రాజెక్టును ప్రత్యామ్నాయంగా భావిస్తే... పోలవరం నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడులు నాటకాలాడుతున్నారని... వారిద్దరిపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని చెప్పారు. టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకని... చంద్రబాబు జాతకం కూడా అంతేనని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News