: రైతులు సమస్యలు చెబుతుంటే, 'క్యాండీ క్రష్' ఆడుకుంటూ వీడియోకు చిక్కిన తమిళ అధికారిణి
రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసిన గ్రీవియన్స్ సెల్ సమావేశంలో, ఓవైపు తమ బాధలను రైతులు విన్నవిస్తుంటే, వాటిని వినడం మానేసిన ఓ అధికారిణి, తన స్మార్ట్ ఫోన్ లో 'క్యాండీ క్రష్ సాగా' గేమ్ ఆడుకుంటూ బిజీగా ఉండిపోయింది. తమిళనాడులోని ధర్మపురికి చెందిన డీఆర్ఓ స్థాయి అధికారిణి, కలెక్టర్ పక్కన వేదికపై కూర్చుని గేమ్ ఆడుకోవడంలో నిమగ్నమైంది. ఇతర అధికారులు రైతులు చెబుతున్న వివరాలు నోట్ చేసుకుంటున్న వేళ, ఈమె అవేమీ పట్టనట్టు తన లోకంలో ఉండిపోయింది. ఈ మొత్తం వీడియోను 'రెడ్ పిక్స్' యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా, మహిళా అధికారిణి తీరు తీవ్ర విమర్శలకు గురైంది. కాగా, ఆమెపై శాఖాపరమైన చర్యలకు తమిళనాడు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం.