: హార్దిక్ పటేల్ మిత్ర బృందంలో మోసగాడు... ఇద్దరు వ్యాపారులకు రూ.కోటి మేర టోపీ పెట్టిన దినేశ్
గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్చాలన్న డిమాండ్ తో రోడ్డెక్కిన హార్దిక్ పటేల్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే బ్యాంకాక్ హోటల్ లో విదేశీ వనితతో సరసాల్లో హార్దిక్ తేలియాడారని చెబుతూ విడుదలైన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో వెంటే మరో వివాదం కూడా ఆయనను చుట్టుముట్టింది. హార్దిక్ పటేల్ మిత్రం బృందంలో ఓ మోసగాడు ఉన్నాడట. హార్దిక్ పటేల్ మిత్రుల్లోని దినేశ్ పటేల్ అనే యువకుడు 2012లో ఇద్దరు జిన్నింగ్ మిల్లు వ్యాపారులకు రూ.కోటి మేర టోపీ పెట్టాడట. బాధితుల ఫిర్యాదుతో అప్పుడే దినేశ్ పటేల్ పై పోలీసు కేసు కూడా నమోదైంది.