: 'మోదీ విఫలం' అంటూ, ఇండియాను వదిలి వెళ్లిన కమోడిటీస్ గురు జిమ్ రోజర్స్


కమోడిటీస్ మార్కెట్లో అపార అనుభవమున్న మార్కెటింగ్ గురుగా, హెడ్జ్ ఫండ్ మేనేజరుగా ఉన్న జిమ్ రోజర్స్, ఇండియా ఇక ఎంత మాత్రమూ లాభసాటి కాదన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇన్వెస్టర్ల అంచనాల మేరకు మోదీ సర్కారు పనితీరు లేదని, ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తూ, భారత కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను అన్నింటినీ వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. "ఇండియాలో అన్నీ మాటలే. చేతలేమీ లేవు" అని 'మింట్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జిమ్ వ్యాఖ్యానించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను సంస్కరణల అమలు కోసం ఏడాదిన్నర కాలం పాటు ఎదురుచూశానని ఆయన వివరించారు. మార్కెట్ వృద్ధికి ఊతమిచ్చేలా నిర్ణయాలు వెలువడతాయని భావించానని, ఆ దిశగా అడుగులు పడలేదని ఆయన అన్నారు. తాననుకున్న మార్పులు జరిగితే, తిరిగి ఇండియాలో పెట్టుబడులు పెట్టే విషయమై పునరాలోచిస్తానని అన్నారు. 1970వ దశకంలో జార్జ్ సోరోస్ తో కలసి క్వాంటమ్ ఫండ్ ను ప్రారంభించిన తరువాత కేవలం 10 సంవత్సరాల వ్యవధిలో తన పెట్టుబడిని 4,200 శాతం పెంచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News