: నేర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్... ఆయనను శిక్షించడానికి చట్టాలు సరిపోవు: కాల్వ
శాసనసభలో రౌడీ సీఎం, రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించడంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేర చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జగన్ అని... భారత శిక్షాస్మృతిలోని అన్ని సెక్షన్లను పెట్టినా తరగని నేరాలను జగన్ చేశారని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఇంత చరిత్ర ఉన్న జగన్ ముఖ్యమంత్రిని రౌడీ అంటుంటే... నిజాయతీ కూడా సిగ్గుతో తలదించుకుంటుందని వ్యాఖ్యానించారు. స్పీకర్ ను కూడా కంట్రోల్ చేయాలనుకునే విధంగా జగన్ ప్రవర్తన ఉందని కాల్వ ఆరోపించారు. రౌడీ అన్న పదానికి జగనే సరైన అర్థమని అన్నారు.