: నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి: హాలీవుడ్ గాయకురాలు కెర్రీ
ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా తీవ్ర భయాందోళనకు గురవుతోంది. గత కొంత కాలంగా తనను దెయ్యాలు వెంటాడుతున్నాయని ఆమె చెబుతోంది. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే, వారు నమ్మడం లేదని... పైగా, తనను పిచ్చిదానిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత నివాసం ఆక్స్ ఫర్డ్ షైర్ లో ఆత్మలు తిరుగుతున్నాయని ఆమె ఫిర్యాదు చేసింది. ఎవరో నన్ను వెంటాడుతున్నారనే విషయాన్ని తాను పక్కాగా చెప్పగలని ఆమె అంటోంది. తనను పిచ్చిదాన్నని అనుకున్నా పర్వాలేదు... కానీ, తాను చెప్పేది నిజమని తెలిపింది.