: చంద్రన్న యాత్ర కాదు... చంద్రన్న 'కరవు' యాత్ర అని పెట్టుకోండి: రోజా
రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న 'చంద్రన్న యాత్ర'పై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి చంద్రన్న యాత్ర అనే పేరు సరిపోలేదని... చంద్రన్న కరవు యాత్ర అని పెట్టుకుంటే సూపర్ గా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీలోని అన్ని జిల్లాలలో ఈ యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, రోజా ఈ విమర్శలు చేశారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని ఆమె అన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంతో, ప్రజలు అల్లాడిపోతున్నారని... అయినా, ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.