: కృష్ణా పుష్కరాల తేదీలు ఇవే... నివేదికలు కోరిన చంద్రబాబు
వచ్చే సంవత్సరం ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను సైతం గోదావరి మహా పుష్కరాలను మించిన రీతిలో విజయవంతం చేయాలని సంకల్పించిన చంద్రబాబు, అందుకు సమగ్ర నివేదికలు తయారు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను ఆదేశించారు. ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ పుష్కరాలు జరుగుతాయని వెల్లడించిన కాంతిలాల్, అన్ని శాఖలతో చర్చించి అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం తదితరాలపై నివేదిక ఇస్తామని అన్నారు. రేపు జరిగే సీఆర్డీఏ సమావేశం తరువాత కృష్ణా పుష్కరాలపై చర్చిద్దామని, సంబంధిత అధికారులు సమావేశానికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఈ సమావేశంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల్లోని రేవులను పూర్తిగా పరిశీలించి, మౌలిక వసతులను ఎలా మెరుగు పరచాలన్న విషయంలో చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.