: రోడ్లపై ఛిద్రమవుతున్న యువత బతుకులు!
రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో 15 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 82 శాతం మంది పురుషులు ఉండగా, మరణించిన వారిలో 35 ఏళ్లలోపు వారు 53.8 శాతం మంది ఉన్నారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు 2014లో మొత్తం 4.89 లక్షల మంది మరణించారు. వీరిలో 35 నుంచి 64 ఏళ్ల వయసున్న వారు 35.7 శాతం మంది. మితిమీరిన వేగం, ఓవర్ లోడింగ్, మద్యం తాగి వాహనం నడపడం తదితర కారణాలతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది.