: ‘సూది లేడి’ ఎంట్రీ!... పాలిటెక్నిక్ విద్యార్థిపై మహిళతో కలిసి సిరంజీ సైకో దాడి


ఉభయగోదావరి జిల్లా పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్నటిదాకా సైకో ‘సూది’ గాడి దాడులతో రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని సైకో కోసం గాలిస్తున్న రెండు జిల్లాల పోలీసులకు నిన్న రాత్రి ‘సూది లేడి’ ఎంటరైనట్లు సమాచారం అందింది. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట పాలిటెక్నిక్ విద్యార్థిపై మహిళా సైకోతో కలిసి ‘సూది’గాడు సిరంజీ దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు తనపై సైకో జంట సిరంజీ దాడి చేసినట్లు బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు సైకో జంటకు సంబంధించిన ఊహాచిత్రాలను విడుదల చేశారు. తాజా దాడితో సైకో దాడికి గురైన బాధితుల సంఖ్య 20కి చేరింది.

  • Loading...

More Telugu News