: సైకో ‘సూది’గాడు ఎలా ఉంటాడంటే?... చిట్టా విప్పిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ


పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసులకు నిన్న సైకో ‘సూది’గాడు దొరికాడన్న వార్తల్లో నిజం లేదట. సైకో ఇంకా తమకు దొరకలేదని సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. పనిలో పనిగా సైకో సూదిగాడి ఊహాచిత్రాన్ని మరోమారు విడుదల చేసిన ఆయన, సైకో రూపం ఎలా ఉంటుందన్న విషయంపైనా సుదీర్ఘంగా వివరించారు. 5.8 నుంచి 5.10 అడుగుల ఎత్తు ఉండే సైకో, దాదాపు 72 కిలోల బరువు ఉంటాడని, వయస్సు 25 నుంచి 30 మధ్య ఉంటుందని ఎస్పీ చెప్పారు. అంతేకాక, ఇప్పటిదాకా సైకో తాను పాల్పడ్డ అన్ని దాడుల్లో బ్లాక్ కలర్ హోండా షైన్ బైక్ పైనే వచ్చాడని, దాడి తర్వాత అదే బైక్ పై పారిపోయాడని కూడా ఎస్పీ చెప్పారు. ఇక సైకో ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డుగా అందించనున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News