: సబ్సిడీ గ్యాస్ కావాలంటున్న మాజీ ముఖ్యమంత్రి!


జమ్మూకాశ్మీర్ లో 2014 ఎన్నికల వరకు 35 ఏళ్లుగా ఓటమెరుగని నేతగా పేరు తెచ్చుకుని, ముఖ్యమంత్రిగా ఆయన సుదీర్ఘ కాలం సేవలందించారు. ఎన్నికల అఫిడవిట్లో సంవత్సరాదాయం పది లక్షలు... ఆస్తులు 13 కోట్లు అని తెలిపిన అలాంటి ఆ వ్యక్తి ప్రభుత్వం అందించే సబ్సిడీ గ్యాస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనెవరో కాదు, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా! ఆయన సబ్సిడీ గ్యాస్ కు దరఖాస్తు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో అధికార పక్షం ఆయనపై విమర్శల దాడి మొదలు పెట్టింది. ఫరూఖ్ అబ్దుల్లా నిజంగా పేదవాడైతే తమ ప్రభుత్వం తరపున ఆరేళ్లపాటు ఆయనకు ఉచిత గ్యాస్ ను సరఫరా చేస్తామంటూ పీడీపీ ఎద్దేవా చేస్తోంది. దీనిపై ఫరూఖ్ ను వివరణ అడగగా, తనకు ఏం చేయాలనిపించిందో అదే చేశానని తెలిపారు.

  • Loading...

More Telugu News