: చైనా వెళ్తున్నా... పరిశ్రమలు తెస్తా...ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు: కేసీఆర్
చైనా పర్యటనకు వెళ్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలు తెచ్చేందుకు ముందుగా చైనా వెళ్తున్నానని అన్నారు. ఆ తరువాత కొరియా, జపాన్ దేశాల్లో కూడా పర్యటిస్తానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత చైనా, కొరియా దేశాల ప్రతినిధులు పరిశ్రమలు పెడతామని అడిగారని, కొరియా ప్రతినిధులు స్మార్ట్ కార్డులు ప్రవేశపెడతామని ముందుకు వచ్చారని, దానిపై ఆలోచిస్తున్నానని ఆయన తెలిపారు. మరిన్ని దేశాలకు వెళ్లాలనే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన చెప్పారు. చైనా పర్యటన ముగిసిన అనంతరం ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు కోరుకున్నంత వరకు శాసనసభ సమావేశాలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.