: విద్యార్థులకు గుండ్లు కొట్టించేశారు... ఇదో రకం పనిష్ మెంట్!


కర్ణాటకలో ఓ పాఠశాల యాజమాన్యం చిత్రమైన శిక్ష విధించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా వీరాజీపేట్ పట్టణంలో వినాయక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థులు 15 మందికి గుండ్లు కొట్టించి, వారి జుట్టును స్కూలు బ్యాగుల్లో పెట్టి ఇళ్లకు పంపించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనిపై స్కూలు యాజమాన్యాన్ని సంప్రదించగా వారు స్పందించలేదని సమాచారం. ఉపాధ్యాయులను అడిగితే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గుండ్లు గీయించినట్టు తెలిపారు. దీనిపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గుండ్లు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. అయినప్పటికీ సమాచారం సేకరిస్తున్నామని, స్కూలు యాజమాన్యం అందుబాటులో లేదని, శుక్రవారం స్కూలు తిరిగి తెరుచుకున్న తర్వాత ఘటనపై పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News