: 'సిరంజి' సైకో రెండో ఊహా చిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు
'సిరెంజీ'లతో రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాలను వణికిస్తున్న 'సైకో' రెండో ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ ఫోటోపై ఏపీ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. వీరవాసరంలో ఓ అనుమానితుడు దొరికాడు, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోపక్క మొదటి ఊహాచిత్రం విడుదల చేసిన పోలీసులు, రెండో ఊహాచిత్రం పేరిట మరోఫోటోను ఇప్పుడు విడుదల చేయడంపై ఆసక్తి రేగుతోంది. మీడియాను, ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ ఊహాచిత్రాన్ని విడుదల చేశారని పలువురు పేర్కొంటుండగా, పోలీసులు మాత్రం నోరుమెదపడం లేదు. అయితే, మొదట విడుదల చేసిన ఊహా చిత్రానికి, రెండో ఊహా చిత్రానికి అస్సలు పోలికలు లేకపోవడం విశేషం.