: మన్మోహన్ పై ఆరోపణలు గుప్పించిన మధుకోడా


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా తీవ్ర ఆరోపణలు చేశారు. జిందాల్ గ్రూపుకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు సహా, ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలు మన్మోహన్ కు తెలిసే జరిగాయని అన్నారు. ఒకవేళ ఈ కుంభకోణంలో ఏదైనా కుట్ర ఉన్నా... అది కూడా మన్మోహన్ కు తెలియకుండా జరిగే అవకాశమే లేదని చెప్పారు. బొగ్గు కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టులో మధుకోడా ఈ మేరకు వెల్లడించారు. మన్మోహన్ ను కూడా కోర్టుకు పిలిపించి, విచారణ జరపాలని కోర్టును కోరారు. మరోవైపు, ఈ విషయంపై సీబీఐ రేపు తన స్పందనను తెలపనుంది.

  • Loading...

More Telugu News