: ఉబెర్ క్యాబ్ పై దావా వేసి... ఉపసంహరించుకున్న మహిళ
అమెరికన్ మహిళపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడంటూ గతేడాది వార్తలు వెలువడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత ఒక డ్రైవర్ ప్రవర్తన వల్ల వ్యక్తిగతంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎంతో నష్టపోయానని పేర్కొంటూ ఆ మహిళ ఉబెర్ క్యాబ్స్ పై అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది. విచారణ జరుగుతుండగా ఆమె దావా ఉపసంహరించుకున్నారు. ఉబెర్ సంస్థ కనీస ప్రమాణాలు పాటించడం లేదని, ప్రయాణికుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. తనకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని ఆమె న్యాయస్థానంలో కేసు వేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా కేసు ఉపసంహరించుకుంటున్నట్టు ఆమె తన న్యాయవాది ద్వారా న్యాయస్థానానికి తెలియజేశారు.