: షీనా బోరా హత్యకు రూ. 150 కోట్లే కారణమా?
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షీనా బోరా హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ, సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కేసుకు సంబంధించి రకరకాల విషయాలు విచారణలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా, పోలీసుల విచారణలో మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు తమ సంస్థను అమ్మడం ద్వారా రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఆదాయాన్ని పొందారు. అయితే, సేఫ్టీ కోసం రు. 150 కోట్లను తన కుమార్తె షీనా అకౌంట్ లోకి ఇంద్రాణి వేసిందట. ఈ విషయం షీనాకు తెలిసిందనేది సమాచారం. ఈ క్రమంలో, రూ. 150 కోట్లకు, షీనా హత్యకు లింక్ ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.