: జగన్ దీక్ష ఓ గిమ్మిక్కు...పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నా ‘హోదా’ రాదు: జేసీ దివాకర్ రెడ్డి


వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షలపై ఆయన కొద్దిసేపటి క్రితం వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్ దీక్షలను ఆయన ఓ గిమ్మిక్కేనని తేల్చేశారు. అయినా దీక్షలకు మహాత్మా గాంధీతోనే కాలం చెల్లిపోయిందని కూడా జేసీ వ్యాఖ్యానించారు. అంతేకాక పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదని కూడా జేసీ తేల్చిచెప్పారు. ‘‘జగన్ దీక్ష ఓ గిమ్మిక్కు. జగన్ దీక్ష వృథా. మంత్రాలకు చింతకాయలు రాలవు. దీక్ష చేస్తే పోలీసులు ఎత్తుకెళ్లి ఇంజక్షన్లు ఎక్కిస్తారు. పెట్రోల్ పోసీ తగులబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదు’’ అని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News