: తెలంగాణలో డ్రోన్ ఫొటోగ్రఫీపై నిషేధం... అత్యవసరమైతే అనుమతి తీసుకోవాలి
డ్రోన్ ల ద్వారా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ముంబయి పోలీసుల హెచ్చరికతో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాంతో సైబరాబాద్ పోలీసులు డ్రోన్ ఫొటోగ్రఫీని నిషేధించారు. సాధారణంగా బహిరంగ సమావేశాల్లో, ముఖ్యమైన ఉత్సవాల్లో, ప్రముఖ కార్యక్రమాల్లో ఈ మధ్య డ్రోన్ లతో ఫోటోలు తీస్తున్నారు. అయితే ఉగ్రవాదులు ఇలాంటి డ్రోన్ లను ఉపయోగించి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిమోట్ సాయంతో నడిచే డ్రోన్ లు, తేలికపాటి విమానాలను ప్రస్తుతానికి నిషేధిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అంతగా అవసరం అనుకుంటే ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని చెప్పారు.