: పవన్ కు ట్విట్టర్ లో నారా లోకేష్ విషెస్
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడూ, ఎల్లప్పుడూ విజయం, సంతోషం మీకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అభినందిస్తున్నా" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన పవన్ ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఆయన మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.