: రాధేమాపై హిందీ నటి డాలీ బింద్రా కేసు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆమెపై బాలీవుడ్ నటి డాలీ బింద్రా ఫిర్యాదుతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనతో తనను వేధిస్తోందని, రాధేమా, ఆమె అనుచరుల నుంచి తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందటూ ఫిర్యాదులో డాలీ తెలిపింది. దాంతో రాధేమా సహా 19 మంది అనుచరులపై కేసు నమోదైంది. అంతకుముందు ట్విట్టర్ లో పలువురు సెలబ్రిటీలపై రాధేమా ఆరోపణలు చేయగా, అదే సమయంలో తన మాజీ భక్తురాలైన డాలీపై కూడా విమర్శలు చేసింది.