: 16 సంవత్సరాల తరువాత లోగోను మార్చిన గూగుల్... కొత్త లోగో ఇదే!


సెర్చింజన్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా నిత్యమూ కోట్లాది మంది వీక్షించే గూగుల్, తన లోగోను మార్చింది. వెబ్ సైట్ ను ప్రారంభించిన 16 సంవత్సరాల తరువాత తొలిసారిగా లోగోను మార్చినట్టు సంస్థ ప్రకటించింది. కొత్త లోగోలో నీలం, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులున్నాయి. లోగోను సింపుల్ గా, కలర్ ఫుల్ గా చూపాలన్న భావనతో పాటు, భవిష్యత్ లో మారే విధానానికి గుర్తుగా చూపాలన్న ఉద్దేశంతో కొత్త లోగోను డిజైన్ చేశామని సంస్థ తెలిపింది. కాగా, ప్రస్తుతం గూగుల్ ఆదాయం సాలీనా 60 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 వేల కోట్లు) దాటింది.

  • Loading...

More Telugu News