: తుపాకుల నుంచి మోర్టార్ల వరకూ గర్జిస్తున్నాయి... ఉగ్రవాదులతో భీకర పోరు చేస్తున్న సైన్యం
పాక్ సరిహద్దుల నుంచి చొరబాటుయత్నం చేస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో భారత సైన్యం నేటి ఉదయం నుంచి తీవ్రంగా పోరాడుతోంది. జమ్మూకాశ్మీర్ పరిధిలోని బారాముల్లా జిల్లా రఫియాబాద్ సమీపంలోని సరిహద్దుల వద్ద లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో యూరీ సెక్టారు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సైన్యం రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, వారిని నిలువరించేందుకు తుపాకులు, మోర్టార్లతో సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? అన్న విషయమై వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి సమాచారం వెలువడాల్సి వుంది.