: ర్యాగింగుకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు: మంత్రి గంటా


నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఘటనపై అసెంబ్లీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో వేసిన నిజనిర్ధారణ కమిటీ 172 మందిని ప్రశ్నించిందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రిషితేశ్వరి తండ్రి తమకు కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్ కూడా పంపారన్నారు. ఇటువంటి ఘటనలపై కచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వదిలిపెట్టమని గంటా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News