: అభిషేకం నుంచి పవళింపు వరకు... శ్రీవారికి సేవ చేస్తారా? 32 వేలకు పైగా టికెట్లు!


తిరుమల శ్రీనివాసునికి ఆర్జిత సేవలను చేయించాలని భావిస్తూ, టికెట్లు లభించడం లేదని బాధపడేవారికి శుభవార్త. అక్టోబరు 3 నుంచి నవంబరు 15 మధ్య, భక్తుల కోసం 32,759 టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తులకు పారదర్శకంగా కేటాయించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా, ముందస్తుగానే సేవల వారీగా మొత్తం టిక్కెట్ల సంఖ్యను, విడుదల సమయాన్ని ప్రకటిస్తున్నామని వెల్లడించింది. ఈ టికెట్లన్నీ 4న విడుదల చేస్తున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలియజేశారు. ఉదయం 11 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని వివరించారు. అభిషేకం నుంచి, తోమాల సేవ, అర్చన, కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణసేవ తదితరాల టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పరిమితంగా లభించే టిక్కెట్ల కోసం భక్తులు నిత్యమూ నిరీక్షించకుండా చూడాలనే ఒకేసారి అధిక సంఖ్యలో టికెట్లను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News