: తెలుగు రాష్ట్రాలకు 9 మంది యువ ఐఏఎస్ లు... ఏపీకి ఐదుగురు, తెలంగాణకు నలుగురు


రాష్ట్ర విభజన తర్వాత అధికారుల కొరతతో తెలుగు రాష్ట్రాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. సరిపడినంత మంది అధికారులు లేకపోవడంతో రెండు రాష్ట్రాల్లోని పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. అలాగే, ఇతర శాఖలను పర్యవేక్షిస్తున్న కొందరు అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ కూడా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ వద్ద పనిచేస్తూ పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడ్డ అధికారులను రిలీవ్ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేశ్ కుమార్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఏపీకి కేటాయించబడ్డ ఈయనను ఆ రాష్ట్రానికి పంపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరు. తాజాగా 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో తొమ్మిది మంది యువ అధికారులను కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. వీరిలో ఐదుగురు (శ్రీకాంత్ వర్మ, డీకే బాలాజీ, హరేంధిక ప్రసాద్, అభిషిక్త కిశోర్, వినోద్ కుమార్)లను ఏపీకి; నలుగురు (గౌతమ్, పమేల్ సత్ పతి, అనురాగ్ జయంతి, రాహుల్ రాజ్) అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News