: సమ్మె ప్రభావం పెద్దగా ఉండదు... బీఎంఎస్, ఎన్ఎఫ్టీయూ సమ్మెకు దూరం: కేంద్ర మంత్రి దత్తాత్రేయ


నేటి కార్మికుల దేశవ్యాప్త సమ్మెపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తనదైన శైలిలో స్పందించారు. సమ్మె ప్రభావం అంత పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని దత్తాత్రేయ నిన్న వ్యాఖ్యానించారు. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్న మాటలో వాస్తవం లేదన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), ఎన్ఎఫ్టీయూలు సమ్మెకు దూరంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కార్మిక సంఘాలు దూరంగా ఉంటున్న నేపథ్యంలో సమ్మె సంపూర్ణంగా ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అయినా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న 12 అంశాల్లో 9 డిమాండ్లకు ఇప్పటికే సానుకూలంగా స్పందించామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన మూడు డిమాండ్లపై విస్తృత స్థాయి చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెపై కార్మిక సంఘాలు పునరాలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News