: ఆ పార్టీకి రఘువీరానే లాస్టు!: జేసీ


రఘువీరారెడ్డే కాంగ్రెస్ పార్టీకి చివరి వ్యక్తి అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం మాట్లాడినా జగన్, రఘువీరా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. జగన్ రాజకీయ పరిణతి సాధించాలని పేర్కొన్న ఆయన, రఘువీరా పార్టీ ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరని అభిప్రాయపడ్డారు. రఘువీరా పార్టీ అనడంలో తన ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి వాడే (రఘువీరా రెడ్డి) చివరి వ్యక్తి అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మళ్లీ మీడియా అపార్థం చేసుకుంటుందేమోనన్న ఆలోచనతో రఘువీరాను 'వాడు' అనడంలో తనకు దురుద్దేశం లేదని, తమ మధ్య ఉన్న బంధం, సాన్నిహిత్యం దృష్ట్యా తాను రఘువీరాను 'వాడు' అని సంబోధించానని జేసీ వివరణ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పడమే తన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News