: ధారవి రాక్ బ్యాండ్ అదుర్స్... ట్విట్టర్ లో బిగ్ బీ ట్వీట్స్!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ ట్విట్టర్ లో కనిపించారు. నిన్న ఆయన ట్విట్టర్ ఖాతాలోకి చొరబడ్డ హ్యాకర్లు కొన్ని అశ్లీల సైట్లను జోడించిన సంగతి తెలిసిందే. హ్యాకర్ల దుశ్చర్యపై హాస్యోక్తులు విసురుతూనే వారు పెట్టిన పోస్టింగ్ లపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సదరు పోస్టింగ్ లతో తనకేమీ పనిలేదని, 'వేరే ఎవరినైనా చూసుకోండి' అంటూ బిగ్ బీ హ్యాకర్లకు చురకలంటించారు. తాజాగా ‘ధారవి రాక్ బ్యాండ్’ పేరిట మురికివాడల్లో ఉండే చిన్నారులు నిర్వహించిన రాక్ బ్యాండ్ కు ఆయన హాజరయ్యారు. చిన్నారులతో కలిసి ఫొటోలు దిగారు. సదరు ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన అమితాబ్, చిన్నారుల రాక్ బ్యాండ్ అదిరిపోయిందని వ్యాఖ్యానించారు. అంతేకాక చిన్నారులతో గడిపిన సమయం గొప్పగా ఉందంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు.