: ప్రత్యేకహోదాపై ప్రకటన రాకుంటే 15 తరువాత గుంటూరులో నిరాహార దీక్ష: జగన్
ప్రత్యేకహోదా కోసం ఈ నెల 15లోగా ప్రకటన రాకుంటే గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమని జగన్ ప్రకటించారు. ప్రత్యేకహోదాపై ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన వివరణ అస్పష్టంగా ఉందని జగన్ చెప్పారు. ప్రత్యేకహోదా వైఎస్సార్సీపీతోనే సాధ్యమని జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం అంతా ఒక్కటై పోరాడాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం మృతి చెందిన వారి పేర్లను కూడా సీఎం చెప్పలేదని ఆయన ఆక్షేపించారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. కేంద్రంలో బీజేపీకి ఇస్తున్న మద్దతును టీడీపీ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి మంత్రులు బయటికి రావాలని ఆయన సూచించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించుకోవాలంటే పోరాటం చేయాలని జగన్ చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు.