: మణిపూర్ లో ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ కొందరు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. ఆ రాష్ట్రంలో బయటివారి రాకపోకల్ని క్రమబద్ధీకరించేందుకు పర్మిట్ విధానం ప్రవేశపెట్టడం, రాష్ట్రంలో భూ సంస్కరణలు తదితర అంశాలకు చెందిన బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ, అక్కడి చురచంద్ పూర్ పట్టణంలో పలువురు చేసిన ఆందోళనలో ముగ్గురు మరణించడం, ఎనిమిది మందికి గాయాలవడంతో ఆ పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. బిల్లు పాస్ అవడానికి సహకరించిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మరో ఐదుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోగా, మరొకరు ఒంటికి నిప్పు అంటుకుని మరణించారు. పలు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి.