: ర్యాగింగ్ భూతానికి మరో బీటెక్ విద్యార్థి బలి
ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి ఘటన మరువకముందే మరో బీటెక్ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద దొరికిన పర్సులో సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నాడు. ఆ రోజు సీనియర్లు అలా చేసుండకపోతే తానిలా చేసి ఉండేవాడిని కాదని సాయినాథ్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. 'ప్లీజ్... స్టాప్ ర్యాగింగ్' అంటూ సూసైడ్ నోట్ లో అభ్యర్థించాడు. కాగా సాయినాథ్ మేడ్చల్ లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.