: వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతపై బాంబు దాడి
కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పులి పంజా విసిరింది. ఇక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వెంకటేశ్వరరెడ్డిపై ఈ ఉదయం 9.30 గంటలకు బాంబు దాడి జరిగింది. జిల్లాలోని పెద్ద వడియం మండలం సుద్దపల్లి గ్రామంలో ప్రత్యర్ధులు బాంబులతో తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సకోసం వెంటనే ఆయన్ను స్థానిక జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. ఇంటినుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ అనూహ్య దాడి జరిగిందని తెలుస్తోంది.