: రెండో ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్!


కొలంబోలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్ చటేశ్వర్ పుజారాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. రెండవ ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయినప్పటికీ, తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేయడం, తొలి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకూ నిలబడటం పుజారాకు ఈ గుర్తింపును తెచ్చి పెట్టాయి. పుజారా చేసిన విలువైన పరుగులే ఇండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని, ఆపై చిరస్మరణీయమైన విజయాన్నీ దగ్గర చేశాయి. ఇక బౌలర్లలో 8 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ (తొలి ఇన్నింగ్స్ లో 5, రెండవ ఇన్నింగ్స్ లో 3)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించవచ్చని భావించినప్పటికీ, అంపైర్లు పుజారా వైపే మొగ్గు చూపారు. ఈ సిరీస్ లో 20 వికెట్లు తీసిన రవిచంద్రన్ ఆశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News