: తల్లి కాబోతున్న బాలీవుడ్ సినీ నటి రాణి ముఖర్జీ
బాలీవుడ్ సినీ నటి రాణి ముఖర్జీ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె వదిన, బుల్లితెర నటి జ్యోతి ముఖర్జీ వెల్లడించారు. హిందీ పత్రిక ముంబై మిర్రర్ తో ఆమె మాట్లాడుతూ, రాణి గర్భవతి అని, వచ్చే ఏడాది జనవరిలో ప్రసవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాణి, ఆమె భర్త, దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రా విదేశాల్లో ఉన్నారని చెప్పారు. గతేడాది ఏప్రిల్ లో రాణి, ఆదిత్యల వివాహం ఇటలీలో జరిగింది. కాగా రాణి తల్లి కానుందని కొన్ని నెలల కిందట బాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి.