: బాబు రాజీనామా చేసినా హోదా రాదు!: కుండబద్దలు కొట్టిన జేసీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజీనామా చేసినా రాష్ట్రానికి హోదా రాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఒకవేళ జగన్ హోదా తీసుకురాగలిగితే తాను రాజీనామా చేస్తానని అన్నారు. హోదా రాదు గానీ, ఓ మంచి ప్యాకేజీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, బీహార్ కు ఇచ్చిన నిధుల కన్నా ఎక్కువగా నిధులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. హోదా గురించి చర్చలు, రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు మరచి, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News