: మోదీ తలచుకుంటే అయిపోతుంది!: జగన్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పెద్ద సమస్య కాదని, ప్రధాని నరేంద్ర మోదీ తలచుకుంటే వెంటనే వచ్చేస్తుందని వైకాపా అధినేత జగన్ అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం రద్దు కావడానికి 7 నెలల సమయం పట్టిందని, మనం పట్టుబట్టి ఉంటే అప్పుడే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని చెప్పారు. దేన్నయినా తనకు అనుకూలంగా మలచుకోవడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. ఏపీ శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సందర్భంగా, జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.